Current Affairs Telugu Daily

భారతీ శర్మకు ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం
సామాజిక కార్యకర్త డాక్టర్‌ భారతీ శర్మకు ఫ్రాన్స్‌ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా చావలియర్‌ డి ఆర్డ్రే నేషనల్‌ డి లా లీజియన్‌ డి ఆనర్‌ పురస్కారం ఇచ్చింది. గురువారం భారత్‌లో ఫ్రాన్సు రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందజేశారు. డాక్టర్‌ భారతి జామియా మిల్లియా ఇస్లామియాలో సోషల్‌ వర్క్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. పదవీ విరమణ చేసిన తరువాత దిల్లీలోని శిశు సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 2003 నుంచి 2009 వరకు వరుసగా రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్నారు. 2007లో బాలనేరగాళ్ల చట్టం రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
views: 920

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams