Current Affairs Telugu Daily

మూక హింస నియంత్రణపై సిఫార్సులకు 2 కమిటీలు
మూక హింస, మూకలు హత్యకు పాల్పడే సంఘటనల నియంత్రణకున్న మార్గాలను, చట్టపరమైన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం 2 ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
  • ఒక కమిటీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వం వహిస్తారని, మరొక కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారని హోం మంత్రిత్వశాఖ 2018 జులై 23న వెల్లడించింది.
  • రాజీవ్‌ గౌబా కమిటీలో జస్టిస్‌, న్యాయవ్యవహారాల కార్యదర్శలు, శాసన విభాగం కార్యదర్శి, సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
  • హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సామాజిక న్యాయ, సాధికార మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
  • రాజీవ్‌ గౌబా కమిటీ చేసే సిఫార్సును రాజ్‌నాథ్‌ బృందం పరిశీలించిన తర్వాత తన సిఫార్సులను ప్రధాని మోడికి సమర్పిస్తుంది.

views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams