Current Affairs Telugu Daily

సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లనున్న ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ : నాసా 
సూర్యుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి అమెరికా రూపొందించిన ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ వ్యోమనౌకను 2018 ఆగస్టు 6న ప్రయోగించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది.
 • ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.
 • ఇది సూర్యుడికి 6.1 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోకి వెళుతుంది. మానవనిర్మిత వస్తువు ఒకటి సూర్యుడికి అంత చేరువగా వెళ్లడం ఇదే మొదటిసారి.
 • సూర్యుడి పరిమాణం, ఇప్పటివరకూ సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లిన వ్యోమనౌక హీలియోస్‌-2. అది సూర్యుడికి 43.4 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది.
 • ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యుజీన్‌ పార్కర్‌ పేరును ఈ వ్యోమనౌకకు పెట్టారు.
 • జీవించి ఉన్న ఒక వ్యక్తి పేరును వ్యోమనౌకకు పెట్టడం ఇదే మొదటిసారి. సూర్యుడి బాహ్య వాతావరణ వలయమైన కరోనా దగ్గరకు అది వెళుతుంది.
 • సౌర వాయువులు, జ్వాలల వల్ల భూమిపై విద్యుత్‌ గ్రిడ్లు దెబ్బతినడం, కమ్యూనికేషన్‌ సాధనాలు మొరాయించడం జరుగుతుంది.
 • ఈ నేపథ్యంలో సూర్యుడి కరోనా, అయస్కాంత క్షేత్రం, సౌర జ్వాలలు, వాయువు గురించి మరింత అవగాహనకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 • దీనివల్ల భూమికి చేరువలోని అంతరిక్ష వాతావరణంలో మార్పును ముందుగానే తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.
 • సూర్యుడి ఉపరితలంతో పోలిస్తే వెలుపలున్న కరోనాలో లక్షల డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉండటానికి కారణాన్ని కూడా ఈ వ్యోమనౌక ఛేదిస్తుందని అంచనా వేస్తున్నారు.
 • పార్కర్‌ ప్రోబ్‌ను 1400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా రూపొందించారు. అందుకోసం తెల్లటి పింగాణీ కవచాన్ని అమర్చారు. దాన్ని రీఇన్‌ఫోర్స్‌డ్‌ కార్బన్‌, కార్బన్‌ ఫోమ్‌తో తయారు చేశారు.
 • వ్యోమనౌకలోని పరికరాలు కాలిపోకుండా శీతల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల లోపల 29 డిగ్రీల సెల్సియస్‌ మేర మాత్రమే ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 150 కోట్ల డాలర్లు.

views: 1095

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams