Current Affairs Telugu Daily

మెసేజ్‌ల ఫార్వర్డ్‌కు వాట్సాప్‌ పరిమితి 
వదంతుల నియంత్రణలో భాగంగా 2018 జులై 20 నుంచి మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేయడానికి వాట్సాప్‌ పరిమితి విధించింది.
  • ఇక నుంచి భారత్‌లోని వినియోగదారులు ఏకకాలంలో 5 చాట్‌లను మాత్రమే ఇతరులకు ఫార్వర్డ్‌ చేయగలుగుతారు.
  • ఇతర దేశాల్లో మాత్రం వినియోగదారులు 20 మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేసుకునే వీలుంటుంది.
  • ఒక మెసేజ్‌ను ఒకేసారి ఎక్కువ మందికి పంపించేందుకు వీలు కల్పించే ‘క్విక్‌ ఫార్వర్డ్‌’ మీటను కూడా తొలగిస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.
  • రాజకీయ దుష్ప్రచారాల కోసం తమ సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం కానివ్వబోమని, ఎన్నిక నాటికి ఈ దిశగా చర్యలు చేపడతామని భారత ఎన్నికల సంఘానికి వాట్సాప్‌ నివేదించింది.
  • తప్పుడు వార్తలను గుర్తించే మాధ్యమాలు ఇప్పటికే ఇతర మార్కెట్లలో వినియోగంలో ఉన్నాయని, ఈ నమూనాలను భారత్‌లో కూడా ప్రవేశపెడతామని తెలిపింది. 
ఇక ఐదు సందేశాలకే పరిమితం 

views: 1025

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams