Current Affairs Telugu Daily

వనజీవి రామయ్య గ్రీన్‌ ఛాలెంజ్‌
వనజీవి రామయ్య గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు హరిత సవాళ్లు (గ్రీన్‌ ఛాలెంజ్‌) విసిరారు.
  • ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి ముగ్గురు ప్రముఖలు మొక్కలు నాటాలని సిఫార్సు చేసే ప్రక్రియలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
  • నల్గొండలోని గోశాలలో ఇగ్నిటెడ్‌ మైండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హరా హైతో బరా హై (పచ్చదనం ఉంటేనే కడుపునిండుగా ఉంటుంది) అనే కార్యక్రమం 2018 జులై 21న నిర్వహించారు.
  • దీనికి హాజరైన వనజీవి దంపతులు అక్కడ మూడు మొక్కలు నాటి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.
  • హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ ఇటీవల మేడ్చల్‌లో మొక్కలు నాటి ఎంపీ కవిత పేరును నామినేట్‌ చేస్తూ సవాలు విసిరారు.
  • స్పందించిన ఎంపీ జులై 21న హైదరాబాద్‌లోని తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటి మరో నలుగురు ప్రముఖలకు ఛాలెంజ్‌ చేశారు.

views: 1146

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams