Current Affairs Telugu Daily

సృజనాత్మక ఆవిష్కరణల్లో ‘నిమోకేర్‌’
హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ-హెచ్‌)కు చెందిన నిమోకేర్‌ స్టార్టప్‌ మహిళా ఆవిష్కరణవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన పోటీల్లో విజయం సాధించింది.
  • దేశవ్యాప్తంగా పలువురు పోటీపడగా చివరకు సృజనాత్మకమైన 4 ఆవిష్కరణలను ఎంపిక చేశారు.
  • ఇందులో ఐఐటీహెచ్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ నిమోకేర్‌ ఉంది. ఐఐటీహెచ్‌లోని సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌(సీఎస్‌ఎఫ్‌ఈ)లో ఈ స్టార్టప్‌ సంస్థ రూపుదిద్దుకుంది.
  • నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిలో ఏమార్పు వచ్చినా తక్షణం వైద్యులను అప్రమత్తం చేసే పరికరాన్ని వీరు కనిపెట్టారు. దీనికి స్మార్ట్‌ బేబీ మానిటర్‌గా నామకరణం చేశారు.
  • దీనిని చిన్నారుల కాలికి తగిలిస్తే చాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైద్యులకు చేరవేస్తుంది.
  • ఇలాంటి ఆవిష్కరణను ప్రోత్సహించే లక్ష్యంతో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌(బీఐఆర్‌ఏసీ) ఈ పోటీని నిర్వహించింది. ఈఏడాది మార్చిలో అన్ని విధాలుగా మేలైన 15 ఆవిష్కరణను గుర్తించి వారికి బయోటెక్‌ పురస్కారాలను అందించారు.
  • వాటి సంస్థ ప్రతినిధులకు చెన్నైలో నిపుణుల, ఇన్వెస్టర్ల సమక్షంలో వారంపాటు వివిధ పోటీలను నిర్వహించారు.
  • ఈ పరికరాలను మార్కెట్లోకి తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలు రచించారు? అవి అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనమనే విషయాలను పరిశీలించారు.
  • అత్యాధునిక సాంకేతికత, ఎక్కువ మందికి ప్రయోజనం దక్కే అవకాశం ఉండటంతో నిమోకేర్‌ స్టార్టప్‌ సంస్థ రూపొందించిన పరికరం తుది పోటీలో అందరినీ ఆకట్టుకొంది.
  • ఈ పరికరాన్ని మరింతగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు మీలుగా రూ.25 లక్షల ప్రోత్సాహక నగదును వీరికి అందించారు.

views: 1326

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams