తుపాకీ లైసెన్సుదారులకు ఇక విశిష్ట గుర్తింపు సంఖ్యలు
 దేశవ్యాప్తంగా తుపాకీ లైసెన్సుదారులందరి పేర్లతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సమగ్ర సమాచారాన్ని (నేషనల్‌ డేటాబేస్‌) రూపొందించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
  • ఇందులోని వ్యక్తులందరికీ (పాతవారు, కొత్తవారైనా..) విశిష్ట గుర్తింపు సంఖ్య (యూఐఎన్‌)ను కేటాయించనున్నారు. ప్రైవేటుగా తుపాకీ అనుమతులున్నవారిలో చాలామంది తరచూ నేరాలకు పాల్పడటం లేదా వేడుకల్లో కాల్పులు జరపడం వంటి చర్యలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
  • ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ చర్యలు చేపడుతోంది. తుపాకీ అనుమతి ఉన్న ప్రతిఒక్కరూ తమ వివరాలను డేటాబేస్‌లో నమోదు చేసుకుని యూఐఎన్‌ను పొందాల్సి ఉంటుందని తెలిపింది.
  • 2019 ఏప్రిల్‌ 1 తర్వాత యూఐఎన్‌ లేని తుపాకీ అనుమతులన్నీ రద్దవుతాయని స్పష్టం చేసింది.
  • చట్టం ప్రకారం వీటిని ‘ఆయుధాల (రెండో సవరణ) నిబంధనలు, 2018’ గా పిలుస్తారు. ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ అనుమతులుంటే - అలాంటి వారంతా ఆ ఆయుధాలన్నింటికీ (తమ యూఐఎన్‌ కింద) ఒకే అనుమతి పొందేందుకు గాను దరఖాస్తు (ఫారమ్‌ 3) చేసుకోవాల్సి ఉంటుంది.

views: 1155

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams