Current Affairs Telugu Daily

300 ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్‌ సేవలు: చైనా
దిగువ భూ కక్ష్యలో  300 ఉపగ్రహాలను ప్రయోగించాలని చైనా నిర్ణయించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ సేవలను అందించొచ్చని భావిస్తోంది.
  • ఇందులో తొలి ఉపగ్రహాన్ని ఈ ఏడాది చివర్లో ప్రయోగించాలనుకుంటోంది. హోంగ్యాన్‌ అనే ఈ ఉపగ్రహ వ్యవస్థలో 300 ఉపగ్రహాలతోపాటు డేటా ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఉంటాయి.
  • మూడు అంచెల్లో దీన్ని సిద్ధం చేస్తారు. ఈ వ్యవస్థ మొత్తం సాకారమైతే.. భూతల ఆధారిత నెట్‌వర్క్‌ స్థానాన్ని ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ఆక్రమిస్తుంది.
  • తద్వారా మారుమూల ఎడారి లేదా సముద్రం సహా భూమిపై ఎక్కడి నుంచైనా మొబైల్‌ఫోన్‌లో మాట్లాడొచ్చు.

views: 1142

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams