రైతులకు ఈ-కామర్స్ సేవలు అందించేందుకు ప్రముఖ ఎరువుల సంస్థ ఇఫ్కో.. సింగపూర్‌కు చెందిన ఐ-మండీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇందుకోసం రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టింది. ‘ఇఫ్కో ఐ-మండీ’ యాప్‌ను ప్రారంభించింది.
వెబ్ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఇఫ్కోతో అనుసంధానమైన 5.5 కోట్ల మంది రైతులకు ఇది మేలు కలిగిస్తుంది. ఐ-మండీలో ఇఫ్కో అనుబంధ సంస్థ అయిన ‘ఇఫ్కో ఈ-బజార్’ 26 శాతం వాటాలు తీసుకొంది.
మిగిలిన 74 శాతం వాటాలు ఐ-టెక్ హోల్డింగ్స్, ఇతర సంస్థలకు ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఐ-మండీ ప్లే స్టోర్, యాప్ స్టోర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.