టైపింగ్‌ నైపుణ్యంతో నాలుగుసార్లు గిన్నిస్‌ రికార్డు
జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఉద్యోగి తన టైపింగ్‌ నైపుణ్యంతో ప్రపంచ రికార్డును తిరగరాస్తున్నారు.
  • వర్సిటీలోని అకౌంట్స్‌ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ నాలుగుసార్లు గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కారు. నోటిలో చిన్నకర్రను పెట్టుకుని, దాంతో వరుసగా ఆంగ్ల అక్షరాన్నింటినీ 17.69 సెకన్లలో టైప్‌ చేసి తాజాగా రికార్డు నెలకొల్పారు.
  • వినోద్‌ మొట్టమొదటగా రికార్డు సాధించింది 2014లో. అప్పుడు ఆయన ముక్కుతో 103 అక్షరాలను 46.3 సెకన్లలో టైప్‌ చేశారు. 2016లో కళ్లకు గంతలు కట్టుకొని ఆంగ్ల అక్షరాలన్నింటినీ 6.71 సెకన్లలో టైప్‌ చేసి మరోసారి గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించారు.
  • ఈ రికార్డు తర్వాత బద్దలైంది. అనంతరం ఒకే వేలితో వేగంగా అక్షరాలను టైప్‌ చేసి.. వినోద్‌ మూడో రికార్డు సాధించారు.
  • వినోద్‌ తన ఇంటివద్దే ఓ కంప్యూటర్‌ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. పేదల, దివ్యాంగ చిన్నారులకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

views: 1003

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams