గదర్‌ పార్టీ 105వ వార్షికోత్సవం
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరుబాటను ఎంచుకున్న గదర్‌ పార్టీ 105వ వ్యవస్థాపక దినోత్సవం అమెరికాలో జరిగింది.
  • 1913వ సంవత్సరంలో ఓరెగాన్‌ రాష్ట్రంలోని ఎస్టోరియా పట్టణంలో గదర్‌ పార్టీ ఏర్పడింది. అప్పట్లో పట్టణంలోని కలప డిపోలో కార్మికులుగా పనిచేసే 74 మంది భారతీయులు, ముఖ్యంగా సిక్కులు సమావేశమై పార్టీ ఏర్పాటును ప్రకటించారు.
  • ఆ భవనానికి సమీపంలోనే ఉన్న పార్కులో 2018 జులై 15న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గదర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ నిర్వహించింది.
  • ఈ కార్యక్రమంలో ఓరెగాన్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా రాష్ట్రాలతోపాటు కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా నుంచి కూడా వందలాది మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.
  • భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్తల బహదూర్‌ సింగ్‌ గదర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.
  • బ్రిటిష్‌ పాలనపై గదర్‌ పార్టీ సాగించిన సాయుధ పోరు విజయవంతం కానప్పటికీ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక అధ్యాయంగా నిలిచిపోయింది.

views: 1044

Current Affairs Telugu
e-Magazine
August-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams