Current Affairs Telugu Daily

భారత్‌లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు
భారత్‌లో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2015లో దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతానికి ఈ జబ్బులే కారణమయ్యాయి.
  • గ్రామీణ ప్రాంతవాసులు, యువకులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. కెనడాలోని సెయింట్‌ మైకెల్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రపంచ ఆరోగ్య పరిశోధన కేంద్రం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
  • 2000తో పోలిస్తే 2015 నాటికి గణాంకాల్లో వచ్చిన మార్పును పరిశోధకులు ఇందులో లెక్కగట్టారు.
  • గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు ఉండే గ్రామీణులు చనిపోతున్న ఘటనలు బాగా పెరిగాయని.. పట్టణ ప్రాంతీయుల మరణాల సంఖ్యను దాటేశాయని వారు వెల్లడించారు.
  • దేశవ్యాప్తంగా పక్షవాత కేసుల్లో మరణాల శాతం తగ్గిందని.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందని తెలిపారు.
  • పక్షవాతానికి గురై అకాల మరణం చెందుతున్నవారిలో దాదాపు 33% ఆ రాష్ట్రాల్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు..

views: 1051Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams