Current Affairs Telugu Daily

భారతీయ భాషల్లో తెలుగుకు 4వ స్థానం 
2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4వ స్థానానికి పడిపోయింది.
  • వృద్ధిరేటు గత నాలుగు దశాబ్దాలల్లో ఎన్నడూలేనంత స్థాయికి తగ్గిపోయింది.
  • దేశంలో తెలుగుమాట్లాడే వారి సంఖ్య 1971లో 8.16% మంది ఉండగా ఇప్పుడు అది 6.70కి తగ్గిపోయింది.
  • మరాఠీలు మనల్ని వెనక్కునెట్టి ఓ మెట్టు పైకెక్కారు. మొత్తంగా చూస్తే దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
  • అదే సమయంలో ప్రాంతీయ భాష ప్రభావం తగ్గుముఖం పడుతూ పోతోంది. 22 షెడ్యూల్దలు   భాషల్లో ఒక్క హిందీ మినహా మిగతా ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య పెరగలేదు.
  • దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 1971లో 36.99% ఉండగా 2011 నాటికి అది 43.63%కి పెరిగిపోయింది. హిందీ విస్తృతి కారణంగా ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
  • సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య 75.60% పెరిగినట్లు లెక్కులు చెబుతున్నా సంఖ్యాపరంగా చూస్తే వేళ్లమీద లెక్కపెట్టేంతే ఉంది.
  • దేశంలో ఇంగ్లిష్‌ ప్రభావం పెరుగుతోందన్న భావన ఉన్నప్పటికీ ఆ భాష మాట్లాడే వృద్ధిరేటు గత దశాబ్దంలో పోలిస్తే పెద్దగా పెరగలేదు. వీరి  సంఖ్య 1971లో 1.91 కోట్లమందిగా ఉండేది.  
  • ఇప్పుడది  2.59 కోట్లకు చేరింది. దేశంలోని 99 నాన్‌ షెడ్యూల్డ్‌ భాషల్లో దాదాపు 17 కనుమరుగవుతున్నాయి. అవి మాట్లాడే వారి సంఖ్య మైనస్‌లో పడిపోయింది.
  • 2011 జనాభా లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 8.11 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు.  
  • ఈ సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 7.06 కోట్లు కాగా, కర్ణాటకలో 35 లక్షలు, మహారాష్ట్రలో 13 లక్షలు, తమిళనాడులో 42 లక్షలు, ఒడిశాలో 6.6 లక్షలు, ఛత్తీస్‌గడ్‌లో 1.52 లక్షలమందిగా ఉంది.
  • పశ్చిమబంగలో 88వేలమంది, పలుదుచ్చేరిలో 74వేల, గుజరాత్‌లో 73వేల, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 50వేల, దేశ రాజధాని దిల్లీలో 25వేల మంది తెలుగుమాట్లాడే వారు ఉన్నారు.
  • 1971 జనాభా లెక్కలు నాటినుంచి దేశంలో తెలుగుమాట్లాడేవారి సంఖ్య మూడోస్థానంలో కొనసాగింది. ఇప్పుడు నాలుగుకు పడిపోయింది. గత నాలుగు దశాబ్దాలుగా హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బెంగాలీయే కొనసాగుతూ వస్తోంది.
  • మరాఠీ మాట్లాడే వారి సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగుకంటే అధికంగా నమోదైనప్పటికీ వారి వృద్ధిరేటు మాత్రం తగ్గుముఖం పడుతూ వస్తోంది.
స్థానం        భాష
1    హిందీ    
2    బెంగాలీ
3    మరాఠీ
4    తెలుగు

views: 1069

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams