Current Affairs Telugu Daily

మశూచిని నయం చేసే ఔషధాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు 
మశూచి వ్యాధిని నయం చేసే ఔషధాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని ఔషధ నియంత్రణ సంస్థలు దీనికి ఆమోదం తెలిపారు.
  • దాదాపు 40 ఏళ్ల క్రితమే ఈ మహమ్మారిని భారీ ఎత్తున టీకా కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా సమూలంగా నిర్మూలించారు.
  • ఒకవేళ ఈ వైరస్‌ను ఉపయోగించుకుని ఉగ్రవాదుల దాడులు జరిపితే ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికాలోని సిగా టెక్నాలజీస్‌ సంస్థ ఈ కొత్త ఔషధాన్ని మాత్రలుగా తయారుచేసింది.
  • దీనికి టీపాక్స్‌గా పేరు పెట్టింది. 1980కల్లా మశూచి ప్రపంచం అంతటా అంతమైపోయింది. ఆ తర్వాత పుట్టిన చాలా మంది ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవట్లేదు.
  • పరిశోధనల కోసం కొన్నిచోట్ల మశూచి వైరస్‌ను ఇప్పటికీ దాచి ఉంచారు. దీన్ని ఉగ్రవాదులు చేజిక్కించుకుని జీవ ఆయుధాల తయారీలో వాడుకునే అవకాశాలున్నాయి.
  • ఇప్పటికే 20 లక్షల మందికి చికిత్స అందించేందుకు అవసరమయ్యే మొత్తంలో ఔషధాలను ఉత్పత్తి చేశామని సిగా టెక్నాలజీస్‌ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం వీటిని నిల్వ ఉంచుకుంటుందని తెలిపింది.
  • కోతులు, కుందేళ్లపై ఈ ఔషధంతో పరీక్షలు జరిపామని.. 90 శాతం కేసుల్లో మశూచిని నయం చేయగలిగామని పేర్కొంది.
  • ఇంతకుముందు మశూచి నయం చేసే ఔషధాలను ఎవరూ తయారుచేయలేదు. కేవలం వ్యాధి నిరోధక టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
  • వైరస్‌ సోకిన 5 రోజుల్లోపే ఈ టీకాను వేస్తే ఇన్‌ఫెక్షన్‌గా మారకుండా అడ్డుకునే వీలుండేది.

views: 1003



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams