Current Affairs Telugu Daily

పాలపుంత కేంద్రంలో తీగల్లాంటి ఆకృతుల చిత్రాన్ని తీసిన మీర్‌కాట్‌ టెలిస్కోప్‌ 
దక్షిణాఫ్రికా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీర్‌కాట్‌ అనే భారీ రేడియో టెలిస్కోప్‌ పాలపుంత కేంద్రానికి సంబంధించిన అద్భుత దృశ్యాన్ని ఒడిసిపట్టింది.
  • పరిశోధకుల ఈ చిత్రాన్ని బయటకు విడుదల చేశారు. పాలపుంత కేంద్రంలోని కృష్ణబిలం చుట్టూ ఉన్న తీగల్లాంటి ఆకృతులు ఇందులో కనిపించాయి.
  • భ్రమిస్తున్న కృష్ణబిలం బయటకునెట్టిన పదార్థంతో అవి ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
  • పాలపుంత అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించేందుకు ఈ తీగల్లాంటి ఆకృతులు ఉపయోగపడతాయని చెప్పారు.
  • 64 రేడియో టెలిస్కోప్‌ను కలిపి ఈ మీర్‌కాట్‌ను పరిశోధకులు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే పెద్దదైన ఎస్‌కేఏ టెలిస్కోప్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

views: 992

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams