Current Affairs Telugu Daily

రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి 
ప్రముఖ నృత్యకారిణి సోనల్‌ మాన్‌సింగ్‌ సహా నలుగురిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 జులై 14న రాజ్యసభకు నామినేట్‌ చేశారు.
  • ప్రధాని నరేంద్రమోదీ సహా మేరకు ఈ నియామకాలు జరిగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
  • వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాజ్యసభకు పంపించేందుకు రాష్ట్రపతికి అధికారం ఉంది.
  • వీరిలో ప్రస్తుతం ఎనిమిది మందే ఉన్నారు. తాజా నియామకంతో నాలుగు ఖాళీలూ భర్తీ అయ్యాయి. 
కొత్త సభ్యుల వివరాలు...
  • సోనల్‌ మాన్‌సింగ్‌: సంప్రదాయ నృత్యకారిణి. భరతనాట్యం, ఒడిస్సీలో ఆరు దశాబ్దాలకు పైగా అభినివేశం ఉంది.
  • నృత్య దర్శకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, వక్తగా, సామాజిక ఉద్యమకారిణిగా ఆమెలో భిన్న పార్శ్వాలున్నాయి.
  • 1977లోనే డిల్లీలో ‘భారత సంప్రదాయ నృత్య కేంద్రా’న్ని నెలకొల్పారు. పద్మవిభూషణ్‌ (2003), పద్మభూషణ్‌ (1992), సంగీత నాటక అకాడమీ పురస్కారాలను పొందారు.
  • రామ్‌ శకల్‌: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతూ వచ్చారు. రైతు, కార్మికుల, వలసదారుల హక్కు కోసం పోరాటాలు నిర్వహించారు.
  • రోబెర్ట్స్‌గంజ్‌ (యూపీ) నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.
  • రాకేశ్‌ సిన్హా: ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త. దిల్లీలోని ‘ఇండియా పాలసీ ఫౌండేషన్‌’ సంస్థకు వ్యవస్థాపకుడు.
  • డిల్లీ విశ్వవిద్యాలయంలో మోతీలాల్‌ నెహ్రూ కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌)లో సభ్యుడు. సమకాలీన అంశాలపై అనేక వ్యాసాలు రాశారు.
  • రఘునాథ్‌ మహాపాత్ర: అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న శిల్పి. 1959 నుంచి ఈ కళనే నమ్ముకుని దాదాపు 2000 మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు.
  • సంప్రదాయ శిల్పకళ, ప్రాచీన కట్టడాల పరిరక్షణకు పాటుపడ్డారు. పూరీలో విశ్వవిఖ్యాత జగన్నాథుని ఆలయ సుందరీకరణలోనూ పాలు పంచుకున్నారు.
  • పార్లమెంటు సెంట్రల్‌హాల్లో కొలువుదీరిన ఆరు అడుగుల ఎత్తైన సూర్యభగవానుని శిల్పాన్ని, పారిస్‌లోని బుద్ధుని ఆలయంలో ఉన్న బుద్ధ భగవానుని కలప విగ్రహాన్ని ఆయనే రూపొందించారు.

views: 1226

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams