Current Affairs Telugu Daily

‘బీసీ కులాలు-సంచార జాతులు’ పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ ‘బీసీ కులాలు-సంచార జాతులు’ పేరిట రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 జులై 14న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు.
  • సంచార జాతుల అభ్యున్నతికి చేపట్టిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఈ పుస్తకంలో వివరించారు. తెలంగాణలోని సంచార జాతుల్లో గల 30 కులాలవారిని బీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
  • దీనిపై అధ్యయన బాధ్యతలను రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికు అప్పగించారు. సీఎస్‌ అధ్యయనం తర్వాత బీసీ కమిషన్‌ దీనిపై పరిశీలన చేయాలని సూచించారు.

views: 1233

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams