Current Affairs Telugu Daily

క్రికెట్‌కు మొహమ్మద్‌ కైఫ్‌ వీడ్కోలు 
భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 2018 జులై 13న ప్రకటించాడు.
  • సరిగ్గా పదహారేళ్ల క్రితం (2002 జూలై 13) నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్లో అద్భుత పోరాటంతో వెలుగులోకి వచ్చిన కైఫ్‌ తన రిటైర్మెంట్‌కు అదే రోజును ఎంచుకున్నాడు.
  • 37 ఏళ్ల కైఫ్‌ 13 టెస్టు, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం  వహించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన అతను 129 దేశవాళీ మ్యాచ్‌ల్లో 7,581 పరుగు చేశాడు.
  • అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అండర్‌-19 ప్రపంచకప్‌ (2000) గెలిచిన భారత యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కైఫ్‌ ఆ తర్వాత  టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
  • 12 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు.
  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాయ్యాడు.  

views: 1292

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams