Current Affairs Telugu Daily

ఎవరిపై ప్రభావవంతమైన విశ్వాసం ఉంది అనే అంశంపై అధ్యయనం
భారత్‌లో ఎక్కువ మంది సైన్యాన్ని విశ్వసిస్తున్నారని, ప్రజల విశ్వాసం చూరగొనడంలో రాజకీయ పార్టీలుఅట్టడుగు స్థానంలో నిలిచినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం(APU), సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(CSDS) నిర్వహించిన అధ్యయనంలో వెల్డయింది.
 • ఎవరిపై ప్రభావవంతమైన విశ్వాసం ఉంది అనే అంశంపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 22 శాసనసభ స్థానాల్లో, 16,680 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు.
 • సైన్యంపై విశ్వాసం ఉందని 77శాతం మందికి పైగా చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో 54.8శాతం, 48 శాతాతో సుప్రీంకోర్టు, హైకోర్టు నిలిచాయి. అత్యధిక విశ్వాసం వ్యక్తం చేసిన వారిశాతం, అసు విశ్వాసమే లేదన్న వారి శాతం మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ‘ప్రభావవంత విశ్వాసం’గా ఈ అధ్యయనం నిర్వచించింది.
 • ఈ అధ్యయన వివరాలను ‘ఇండియాస్పెండ్‌’ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది.
 • ఈ ఎనిమిది రాష్ట్రాల్లో పార్లమెంట్‌పై నమోదయిన సగటు విశ్వాస శాతం 36.6. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిపై పార్లమెంట్‌, శాసనసభ, పంచాయతీ/పురపాలక సంస్థ వంటి వాటిపై 40 శాతం మందే విశ్వాసం ఉంచారు.
 • రాజకీయ పార్టీపై సగటున విశ్వాసం -1.75 శాతమే నమోదయింది. ప్రభుత్వ అధికారులపై 4.8శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసుపై 5.7 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.
 • మహారాష్ట్రలో రాజకీయపార్టీపై అత్యధికంగా 31శాతం విశ్వాసం వ్యక్తమయింది. ఈ రాష్ట్రంలో పార్లమెంట్‌, శాసనసభ, పంచాయతీ వంటి వాటిపై ప్రజలు పెట్టుకున్న విశ్వాస శాతం ఎక్కువగా 63.
 • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజల విశ్వాసం చూరగొనడంలో రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలమయినట్లు ఈ అధ్యయనాన్ని బట్టి వెల్లడవుతోంది. రాజకీయ పార్టీలపై విశ్వాసం ఆంధ్రప్రదేశ్‌లో -24శాతంగా నమోదు కాగా తెలంగాణలో -21శాతంగా ఉంది.
 • మధ్యప్రదేశ్‌లో -9శాతం, ఝార్ఖండ్‌లో -3శాతంగా నమోదయింది. మహారాష్ట్రలో 31శాతం మంది రాజకీయ పార్టీలను విశ్వసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌పై విశ్వాసం -4శాతంగా, శాసనసభలపై -2శాతంగా నమోదయింది.
 • ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలో పాల్గొన్నవారు సైన్యంపై అత్యధిక విశ్వాసం ఉంచినా ఇతర వ్యవస్థలన్నింటిపైనా అనుమానం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై మొత్తం మీద వెల్లడయిన సగటు విశ్వాసం 50శాతమే కాగా ఆంధ్రప్రదేశ్‌లో అందులో సగమే నమోదయింది.
 • ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలో పాల్గొన్నవారికి ప్రధానమంత్రిపై నమ్మకం లేదు. మిగిలిన రాష్ట్రాల్లో 48శాతం మందికి ప్రధానమంత్రిపై విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రిపై ఉన్న విశ్వాసం -4శాతం. రాష్ట్రపతిపైనా ఇంతే నమోదయింది.
 • ఆంధ్రప్రదేశ్‌లో సుప్రీంకోర్టుపై 21శాతం, హైకోర్టుపై 20శాతం, జిల్లా న్యాయస్థానాపై 28శాతం విశ్వాసం నమోదయింది.
APU-Azim Premji University
CSDS-Centre for the Study of Developing Societies

views: 1138

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams