Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రచారంపై బాంబు పేలుళ్లు 
పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2018 జులై 13న రెండుచోట్ల శక్తిమంతమైన బాంబు దాడులకు పాల్పడ్డరు. ఇందులో ఒక అభ్యర్థి సహా 128 మంది మృతి చెందారు.
  • సుమారు 150 మంది వరకు గాయపడ్డారు. బూచిస్థాన్‌ రాష్ట్రంలోని మస్తుంగ్‌ ప్రాంతంలో  జాతీయవాద బూచిస్థాన్‌ అవామీ పార్టీ (బీఏపీ) ఎన్నికల సభలో ఆ పార్టీ నేత సిరాజ్‌ రైసానీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు పేల్చారు.
  • ఆయన బూచిస్థాన్‌ మాజీ సీఎం నవాబ్‌ అస్లామ్‌ రైసానాకు సోదరుడు.  తీవ్రంగా గాయపడిన సిరాజ్‌ను క్వెట్టాలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
  • ఖైబర్‌ పక్తుంఖ్వా రాష్ట్రంలోని బన్ను ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి, ముత్తహిద మజ్లిస్‌ అమాల్‌ (ఎంఎంఏ) కూటమి అభ్యర్థి అక్రమ్‌ ఖాన్‌ దుర్రానీని లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చారు.
  • ఐదుగురు చనిపోగా, 37 మంది గాయపడ్డారు. దుర్రానీ క్షేమంగా బయటపడ్డారు. ఆయన వాహనం బాగా దెబ్బతింది.
  • 2018 జులై 25న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బన్ను నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. 

views: 953

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams