Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అరెస్టు 
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌, ఆయన కుమార్తె మరియంను లాహోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
  • పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి అవెన్‌ఫీల్డ్‌ హౌస్‌ అక్రమాస్తుల కేసులో జవాబుదారీ న్యాయస్థానం వారిని దోషులుగా ప్రకటించడంతో వారిని అరెస్టు  చేశారు.
  • తీర్పు వెలువడినప్పటికే లండన్‌లో ఉన్న నవాజ్‌ షరీఫ్‌ (68), ఆయన కుమార్తె మరియం(44) 2018 జులై 13 రాత్రి లండన్‌ నుంచి అబుదాబీ మీదుగా లాహోర్‌ చేరుకున్నారు.
  • అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతున్న షరీఫ్‌ భార్య కుల్సుమ్‌కు తోడుగా ఉండడానికి వారు అంతకుముందు లండన్‌ వెళ్లారు. లాహోర్‌లో విమానం నుంచి తండ్రీకుమార్తె దిగిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న పాకిస్థాన్‌ అవినీతి వ్యతిరేక విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
  • వారిద్దరూ ఎటువంటి ప్రతిఘటనా లేకుండానే లొంగిపోయారు.అవెన్‌ఫీల్డ్‌ అక్రమాస్తుల కేసులో షరీఫ్‌, మరియంను జవాబుదారీ న్యాయస్థానం 2018 జులై 6న దోషులుగా నిర్ధారించింది. షరీఫ్‌కు పదేళ్లు, మరియంకు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది.

views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams