Current Affairs Telugu Daily

ఏపీ పర్యాటకానికి ప్రత్యేక లోగో
 ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక విభాగానికి ప్రత్యేక లోగో రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన లోగోనే ఇప్పటికీ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రను ప్రతిబింబించేలా నూతన లోగోను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రాపగండ సంస్థ రూపొందించిన 15 నమూనాలను గురువారం పర్యాటకశాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి హిమాన్షుశుక్లా పరిశీలించారు. వాటిలోనుంచి 6 నమూనాలను ఎంపిక చేశారు. ఈ నెల 20న జరగనున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డు తొలి సమావేశంలో ఈ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుంచనున్నారు. వాటిలో సీఎం సూచనతో ఒక నమూనాను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రతిబింబించేలా తీరప్రాంతం, బుద్ధ ప్రాజెక్టులు, శ్రీశైలం పులుల జోన్‌ వంటి వాటిని కలగలిపి ఈ లోగోలను సిద్ధం చేశారు.
views: 1194

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams