Current Affairs Telugu Daily

ఆగస్టు 1 నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య సర్వే 
గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2018’ పేరిట సర్వే కార్యక్రమాన్ని 2018 జులై 13న ప్రారంభించింది.
  • వాస్తవ సర్వే 2018 ఆగస్టు 1 నుంచి 31 వరకు జరుగుతుంది. సర్వే బాధ్యతలను ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించింది.
  • దీంట్లో వచ్చిన ఫలితాలు ఆధారంగా జిల్లాలు, రాష్ట్రాలకు ర్యాంకు ఇవ్వనుంది.
  • పరిశుభ్రత కోసం విధించిన ప్రమాణాలను పాటించడం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బజార్లు, తదితర బహిరంగ ప్రాంతాల్లో శుభ్రత పాటిస్తున్న తీరు, స్వచ్ఛ భారత్‌లో పౌరులు భాగస్వాములవుతున్న విధానం, వారు ఇచ్చే సూచనలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకు ఇవ్వనుంది. కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
  • ఉత్తమ రాష్ట్రాలు, జిల్లాలకు అక్టోబరు 2న పురస్కారాలు ఇవ్వనున్నారు. సర్వేలో భాగంగా దేశంలోని 680 జిల్లాలు, 6,800 గ్రామాలు, 34,000 బహిరంగ ప్రదేశాలను పరిశీలించనుంది.
  • 54 వేల మంది పౌరులను ఇంటర్వ్యూ చేయనుంది. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 30 శాతం మార్కులు, ప్రజల అభిప్రాయాలకు 35 శాతం మార్కులు, ప్రమాణాలు ఆధారంగా పారిశుద్ధ్య నిర్వహణకు 35 శాతం మార్కులు ఇవ్వనుంది.
  • ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండ్కూర్‌తో ఆడియో, వీడియో ద్వారా ప్రచారం చేయించనుంది.

views: 1060

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams