Current Affairs Telugu Daily

101 ఆకాంక్ష జిల్లాల్లో పౌష్టికాహారం : కేంద్రం
పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలకు విటమిన్లు, ఇతర సూక్ష్మ పోషకాలు ఉన్న బియ్యం, గోధుమలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • జాతీయ పౌష్టికాహార మిషన్‌లో భాగంగా 101 ఆకాంక్ష జిల్లాల్లో దీన్ని అమలు చేయనుంది.
  • ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 జిల్లాలు ఉన్నాయి. బియ్యం, గోధుమల్లో విటమిన్లు, ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్లువంటి సూక్ష్మ పోషకాలను మిళితం చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తారు.
  • ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రమాణాల ప్రకారం క్వింటాలు బియ్యం/గోధుమల్లో ఒక కిలో వరకు సూక్ష్మపోషకాలను కలుపుతారు.
  • ఈ 101 జిల్లాల్లో రేషన్‌ దుకాణాల ద్వారా ప్రస్తుతం అందజేస్తున్న బియ్యం/గోధుమల బదులు సూక్ష్మపోషకాలు మిళితం చేసినవి అందిస్తారు.
  • ప్రత్యేకంగా ఫోర్టిఫికేషన్‌ యంత్రాలను సమకూర్చుతారు. 2015-16లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయిన వివరాల ప్రకారం అయిదేళ్లలోపు పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు.
  • 38.4%మంది పిల్లలు తమ వయసుకు తగ్గ బరువు కలిగిలేరు. దీని అమలుపై రాష్ట్రాతో సమన్వయంచేసుకోవడంకోసం నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జాతీయ పౌష్టికాహార మండలి ఏర్పాటయింది.
  • దీని అమలు తీరును ప్రతి 6 నెలలకు ప్రధానికి నివేదిస్తుంది. తొలుత 101జిల్లాల్లో అమలయిన తీరును సమీక్షించినతరువాత ఈ పథకాన్ని మిగిలిన 235 ఆకాంక్ష జిల్లాల్లోనూ అమలు చేస్తారు.
  • జాతీయ పౌష్టికాహార మిషన్‌కు ఒకేసారి మూడేళ్ల బడ్జెట్‌ కింద రూ.9,046 కోట్లు కేటాయిస్తూ 2017 డిసెంబరులో కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.

views: 1007

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams