Current Affairs Telugu Daily

విశ్వంలో అత్యంత అరుదైన జంట గ్రహ శకలాలు గుర్తింపు
విశ్వంలో అత్యంత అరుదైన జంట గ్రహ శకలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్కొక్కటి 900 మీటర్ల మేర వెడల్పును కలిగి ఉండి, ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తున్నాయి.  
  • భూమికి చేరువలోని ‘2017 వైఈ5’ అనే ఈ గ్రహశకలాన్ని గత ఏడాది గుర్తించారు.
  • దానికి సంబంధించిన వివరాలేవీ అప్పట్లో తెలియలేదు. 2018 జూన్‌ 21న ఇది భూమికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • ఇది జంట శకల వ్యవస్థ అయ్యి ఉండొచ్చని 2018 జూన్‌ 21, 22 తేదీల్లో నాసాకు చెందిన గోల్డ్‌స్టోన్‌ సోలార్‌ సిస్టమ్‌ రాడార్‌ తొలి సంకేతాలిచ్చింది.
  • ఆ తర్వాత మరో రెండు టెలిస్కోపు పరిశీలనలు సాగించి, అందులో రెండు గ్రహశకలాలు ఉన్నట్లు నిర్ధరించాయి.
  • రెండింటి మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉందని తేల్చాయి. ఒకే విధమైన ద్రవ్యరాశి కలిగిన జంట గ్రహశకల వ్యవస్థల్లో ఇది నాలుగోది.

views: 1034

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams