Current Affairs Telugu Daily

రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై RBI నివేదిక 
గత అయిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా అందిస్తున్న వ్యవసాయ రుణ మాఫీలవల్ల రైతులకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదని  రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై RBI విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
  • 2008 నుంచి వరుసగా అమలు చేస్తూ వస్తున్న రుణమాఫీలను చూస్తే రైతు కుటుంబాల రుణభారం తగ్గినప్పటికీ పెట్టుబడులు, కుటుంబాల ఆదాయం పెరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది.
RBI నివేదికలోని అంశాలు
  • 2014 నుంచి వివిధ రాష్ట్రాలు ప్రకటిస్తూ వస్తున్న రైతు రుణమాఫీ కారణంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. 
  • వరుస కరువు, గిట్టుబాటు ధరలు  లేక రైతులు  నష్టపోతున్నారన్న కారణంగా రుణమాఫీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వాలు  చెబుతున్నాయి.
  • ఈ మాఫీ ప్రభావం ఒక్కో రాష్ట్రంపై ఒక్కో విధంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ చేసిన రుణమాఫీ దాని స్థూల ఆర్థిక లోటులో దాదాపు 60.9%కి సమానం. 
  • 2017-18లో వివిధ రాష్ట్రాలు చేసిన రుణమాఫీలు అవి ప్రకటించినదానికంటే తక్కువగా ఉన్నాయి.
  • పూర్తిస్థాయిలో అమలుచేస్తే ఆర్థిక పరిస్థితులు మరింత కుంచించుకుపోవడం ఖాయం. ఈ పథకాల కారణంగా 2017-18లో వివిధ రాష్ట్రాల మూలధన వ్యయం తగ్గిపోయింది. 
  • ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై చేసే ఖర్చు తగ్గిపోయింది. ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలను దారితప్పేలా చేస్తున్నాయి.
  • ఉదయ్‌, వేతనసవరణ సిఫార్సులను అమలుచేయలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. 
  • రుణమాఫీ లాంటి ఆర్థిక ప్రోత్సాహాల కారణంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
  • పైగా దీనివల్ల పెరిగే ఆర్థికలోటు జీడీపీ వృద్ధికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.
  • మాఫీలను సమర్థవంతంగా అమలుచేయకపోతే ఇది మరింత ద్రవ్యోల్బణానికి దారితీసి ఆర్థికలోటును ఆందోళనకర స్థితికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. 
  • రుణమాఫీల కారణంగా భవిష్యత్తులో బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వడానికి సుముఖత చూపించకవచ్చు. ఫలితంగా గ్రామీణ రుణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 
  • రైతు విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులవైపు మళ్లే రోజులు వస్తాయి. రుణమాఫీల వల్ల అసలైన రైతులకంటే ఇతరులే ఎక్కువ లబ్ధిపొందారు.
  • రుణమాఫీ ప్రభుత్వ బ్యాలెన్స్‌షీట్లకు హానికారకం. ప్రభుత్వ విధానాల అమలుపై అంతులేని ప్రభావాన్ని చూపుతుంది
RBI గవర్నర్‌ - ఉర్జిత్‌ పటేల్‌
RBI-Reserve Bank of India

views: 910

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams