Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ ఈఈకు CPWD  అవార్డులు
కేంద్ర ప్రభుత్వ భవనాల్లో సివిల్‌ పనులు చేపట్టడంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు CPWD  అవార్డులు దక్కాయి.
  • 164వ CPWD  దినోత్సవం సందర్భంగా 2018 జులై 12న డిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు.
  • ఇంజనీర్లు మనోజ్‌కుమార్‌, టీఎస్‌ జనార్ధన్‌ ఈఈ విభాగంలో డైరెక్టర్‌ జనరల్‌ మెడల్‌ సంపాదించారు. ఉత్తమ ప్రాజెక్టు విభాగంలో హైదరాబాద్‌లోని ఎన్‌ఎసజీ ప్రాంతీయ కార్యాలయం ఉత్తమ నివాస సముదాయంగా మొదటి స్థానంలో నిలిచింది.
  • వరంగల్‌ నిట్‌లోని అకడమిక్‌ భవంతి ఇన్‌స్టిట్యూషనల్‌ విభాగం 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి విడిదిలో గల నక్షత్రవాటిక గార్డెన్‌ ఉత్తమ ఉద్యానవన నిర్వహణ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది
CPWD-Central Public Works Department

views: 1222



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams