Current Affairs Telugu Daily

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పదవీకాలం పెంపు
తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పదవీకాలాన్ని పెంచుతూ 2018 జులై 12న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో తొలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 2015 మార్చి 26న ఏర్పాటైంది. బోర్డు పదవీకాలం 2017 అక్టోబరు 31న ముగిసింది.
  • ఈ క్రమంలో కొత్త బోర్డు ఏర్పాటు అయ్యేంత వరకు ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించాల్సిందిగా కోరుతూ 2018 మార్చి 7న ప్రభుత్వానికి కార్మిక శాఖ కమిషనర్‌ లేఖ రాశారు.
  • దీంతో ప్రస్తుత పాలకవర్గాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 అక్టోబరు 31 వరకు ఈ బోర్డు కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

views: 1149

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams