Current Affairs Telugu Daily

యూరియా కుంభకోణంలో రూ.100 కోట్ల జరిమానా 
దాదాపు 23 ఏళ్ల క్రితం బయటపడిన యూరియా కుంభకోణంలో నిందితులైన ఇద్దరు టర్కీ జాతీయులకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ డిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2018 జులై 12న తీర్పునిచ్చింది.
  • అవినీతి కేసుల్లో ఇంత భారీ మొత్తాలను జరిమానాగా విధించడం అరుదు. టర్కీకి చెందిన కర్సన్‌ లిమిటెడ్‌ మాజీ కార్యనిర్వహణాధికారులు- టన్‌కే అంకుస్‌, చిహన్‌ కరాన్సీలకు చెరో 6 సం॥ల చొప్పున కఠిన కారాగార శిక్ష కూడా విధించింది.
  • ఆ కంపెనీకి భారతీయ ప్రతినిధి ఎం.సాంబశివరావు, డి.మల్లేశం గౌడ్‌ (చెరో మూడేళ్ల జైలు, రూ.5 కోట్ల జరిమానా)బీ కేంద్ర మాజీ మంత్రి రామ్‌ఖన్‌సింగ్‌ యాదవ్‌ తనయుడు ప్రకాశ్‌చంద్ర యాదవ్‌, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు సంజీవరావు (చెరో రూ.కోటి జరిమానా, మూడేళ్ల జైలు), జాతీయ ఎరువు సంస్థ(ఎన్‌ఎఫ్‌ఎల్‌) మాజీ సీఎండీ సీకే రామకృష్ణన్‌, మాజీ ఈడీ దిల్‌బాగ్‌సింగ్‌ కన్వర్‌ (వీరిద్దరికీ మూడేళ్ల శిక్ష, రూ.6 లక్షల జరిమానా)కు శిక్షలు పడ్డాయి. 
  • నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడి ఎన్‌.ఎఫ్‌.ఎల్‌.కు రూ.133 కోట్ల మేర మోసగించినట్లు 1996 మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది.
  • 2 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయడానికి రూ.133 కోట్ల పనిని పొంది, ఆ తర్వాత సరకు ఇవ్వకుండా మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • తీసుకున్న డబ్బును టర్కీ జాతీయులు వివిధ విదేశీ బ్యాంకులకు మళ్లించారని, భారత్‌కు చెందిన నిందితులకు హవాలా మార్గంలో డబ్బు వచ్చిందని తెలిపారు.

views: 833

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams