Current Affairs Telugu Daily

దక్షిణ కొరియా, భారత్‌ల మధ్య 11 ఒప్పందాలు 
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ భారత పర్యటనలో భాగంగా 2018 జులై 10న డిల్లీలో ప్రధాని నరేంద్రమోడితో సమావేశమయ్యారు.
  • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
  • రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
  • ఈ సందర్భంగా 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(CEPA) నవీకరణ ప్రక్రియపై సంప్రదింపులను ప్రారంభించాలని ఓ ఒప్పందంపై సంతకం చేశాయి.
  • ద్వైపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి ద.కొరియా మద్దతు తెలిపింది.
CEPA- Comprehensive Economic Partnership Agreement

views: 1221

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams