Current Affairs Telugu Daily

ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ కొత్త ఫీచర్‌
నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వాట్సాప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తెచ్చింది.
  • ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్‌ను స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని కేవలం ఫార్వర్డ్‌ చేశారా అని తెలుసుకోవచ్చు.
  • వాట్సాప్‌ యాప్‌ తాజా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు సంస్థ 2018 జులై 10న వెల్లడించింది.
  • వినియోగదారులు ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందు అది ఎంతవరకు నిజమో సరిచూసుకోవాలని కోరింది.
  • నకిలీ సమాచారం వ్యాప్తి కాకుండా ఉండేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వాట్సాప్‌ భారత్‌లో ప్రారంభించింది.
  • వాట్సాప్‌లో తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందడం వల్ల దేశంలో పలుచోట్ల మూకుమ్మడి దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం జరిగాయి. 

views: 1075

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams