Current Affairs Telugu Daily

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బ్రెట్‌ కెవనాఫ్‌
సుదీర్ఘ కసరత్తు తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సంప్రదాయ వాది జస్టిస్‌ బ్రెట్‌ కెవనాఫ్‌(53)ని నామినేట్‌ చేశారు.
  • రిపబ్లికన్‌ పార్టీతో ఆయనకు విస్తృత సంబంధాలున్నాయి. ప్రముఖ భారతీయ అమెరికన్‌ జడ్జి అమూల్‌ థాపర్‌ సహా 25 మందితో కూడిన జాబితాను పరిశీలించిన తర్వాత జస్టిస్‌ కెవనాఫ్‌వైపే ట్రంప్‌ మొగ్గు చూపారు.
  • అధ్యక్షుడి ఎంపికను వ్యతిరేకిస్తామని డెమొక్రాట్లు స్పష్టం చేశారు. జస్టిస్‌ కెవనాఫ్‌ ప్రస్తుతం కొలంబియా సర్క్యూట్‌ జిల్లా అప్పీళ్ల కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
  • జస్టిస్‌ ఆంటోనీ కెన్నడీ(81) పదవీ విరమణ చేయడంతో ఈ నియామకం అవసరమయింది.

views: 983

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams