Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియాలో ఎనిమిదేళ్లకు చిక్కిన రాకాసి మొసలి 
ఆస్ట్రేలియాలో ఎనిమిదేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న రాకాసి మొసలి అధికారులకు చిక్కింది.
  • 600 కేజీ బరువు, 15.4 అడుగుల పొడవు ఉండే ఈ మొసలి కేథరిన్‌ నదిలో ఏర్పాటు చేసిన ఉచ్చులో పడింది. 2010లో ఈ ఉప్పునీటి మొసలి తొలిసారి తమ కంటపడినట్లు అధికారులు తెలిపారు. దీని వయసు 60 ఏళ్ల వరకూ ఉండొచ్చని లెక్కగట్టారు.
  • స్థానికులకు దీని వల్ల హాని కలగకుండా మొసళ్ల పెంపక కేంద్రానికి తరలించారు.
  • కేథరిన్‌ నదిలో తాము ఇప్పటివరకూ పట్టుకున్న అతిపెద్ద మొసలి ఇదే. ఆస్ట్రేలియాలో వన్యప్రాణి విభాగం సిబ్బంది ఏటా 250 దాకా సమస్యాత్మక మొసళ్లను పట్టుకుంటుంటారు.
  • క్వీన్స్‌లాండ్‌ ఉత్తర ప్రాంతంలో ఈ ఉప్పునీటి మొసళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఏటా సగటున ఇద్దరి ప్రాణాలను ఇవి బలితీసుకుంటున్నాయి.
  • 1970ల్లో మొసళ్లను అంతరించిపోతున్న జీవా జాబితాలో ఆస్ట్రేలియా చేర్చింది. అప్పటి నుంచి వీటి సంఖ్య చాలా పెరిగింది. వీటిని కట్టడి చేయాలన్న డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయి.

views: 860

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams