Current Affairs Telugu Daily

ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్‌కు అగ్రస్థానం
ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్‌ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు 57వ స్థానం దక్కింది.
  • ప్రపంచంలో అత్యంత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి ఏడాది కార్నెల్‌ విశ్వవిద్యాలయం, ఇన్‌సీడ్‌, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO), జీఐఐ విజ్ఞాన భాగస్వాములు కలిసి గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌(GII) ర్యాంక్‌లను ప్రకటిస్తాయి.
  • గత ఏడాది 60వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ ఏడాది మూడు స్థానాలు ఎగబాకి 57వ స్థానాన్ని దక్కించుకొంది.
  • వ్యాపారం ప్రారంభించి సులువుగా చేసుకునేందుకు భారత్‌లో అనేక ఇబ్బందులున్నాయని GII నివేదిక తేల్చింది.
  • రాజకీయ స్థిరత్వం, భద్రత, అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలున్న మహిళా ఉద్యోగులు లభించడం వంటి పలు విషయాల్లో ఇబ్బందు తప్పడం లేదని వెల్లడించింది.
  • GII ప్రకటించిన ర్యాంకుల్లో మధ్య, దక్షిణ ఆసియాలో భారత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఐటీ సేవల ఎగుమతుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నా వాటి వినియోగంలో 110వ స్థానం, యాక్సెస్‌లో 105వ ర్యాంకులో ఉంది. 
  • దిగువ మధ్య ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో జీఐఐ ర్యాంకుల్లో భారత్‌ 5వ స్థానాన్ని దక్కించుకొంది.
  • గత ఎనిమిదేళ్లుగా వరుసగా తలసరి జీడీపీ విషయంలో సృజనాత్మకంగా వృద్ధి చెందుతోంది. 
  • ఉత్పాదకత పెరుగుదల, ఐటీ, సమాచార సేవల రంగంలో వృద్ధి వంటి అంశాలు భారత్‌ను మంచి స్థానంలో నిలబెడుతున్నాయి. 
  • ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల ఆర్థిక వ్యవస్థల్ని మేధో సంపత్తి దాఖలు రేట్లు, మొబైల్‌ యాప్‌ సృష్టి, విద్యా రంగంపై ఖర్చు పెడుతున్న మొత్తాలు, శాస్త్ర, సాంకేతికత వంటి 80 అంశాలను పరిగణనలోకి తీసుకొని GII పదకొండోసారి ర్యాంకుల్ని ప్రకటించింది. 
  • శాస్త్ర రంగంలో భారత్‌కు బలం ఉండటతోపాటు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు అధికంగా ఉండటం కలిసొచ్చింది.
  • ఈ విభాగంలో 6వ ర్యాంకు సాధించింది. మైనార్టీ పెట్టుబడిదారుల్ని రక్షించే విషయంలో 4వ స్థానం, వాణిజ్యంలో 16వ స్థానం, ప్రపంచ పరిశోధన, అభివృద్ధి కంపెనీ సూచీ విభాగంలో 18వ ర్యాంకు, స్థూల పెట్టుబడుల విషయంలో 20వ ర్యాంకు, మొత్తం పెట్టుబడుల విభాగంలో 35వ ర్యాంకు పొందింది. 
  • ఇలా 80 అంశాల వారీగా GII ర్యాంకుల్ని కేటాయించింది. పర్యావరణ పరంగా భారత్‌ 123వ ర్యాంకులకు పడిపోయింది. 
  • GII-2018 ర్యాంకుల్లో స్విట్జర్లాండ్‌ తొలి స్థానంలో నిలిచింది. తరవాత స్థానాల్లో నెదర్లాండ్స్‌, స్వీడెన్‌, యూకే, సింగపూర్‌, యూఎస్‌, ఫిన్‌ల్యాండ్‌, డెన్మార్క్‌, జర్మనీ, ఐర్లాండ్‌ దేశాలున్నాయి. 
  • మధ్య ఆదాయం ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఇప్పటికే టాప్‌-25 జాబితాలో చేరింది. ఈ గ్రూపులో చేరడానికి మలేసియా, భారత్‌, ఇరాన్‌, మెక్సికో, థాయ్‌లాండ్‌, వియత్నాం దేశాలు సిద్ధమవుతున్నాయి.
WIPO-World Intellectual Property Organization
GII-Global Innovation Index

views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams