Current Affairs Telugu Daily

రాజ్యసభలో 22 భాషల్లో మాట్లాడే అవకాశం 
2018 జులై 18న ప్రారంభమయ్యే రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో 22 భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
  • మాతృభాషలోనే మన భావాలను, ఆలోచనను ఎటువంటి ఆటంకం లేకుండా స్పష్టం చేయగలమని.. మాతృభాషే సహజ మాధ్యమంగా తాను భావిస్తానన్నారు.
  • బహు భాష నియమైన పార్లమెంటులో భాషా పరిమితుల దృష్ట్యా ఏ ఒక సభ్యుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.
  • రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషకు సంబంధించిన వ్యాఖ్యాతలు ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. తాజాగా డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాళి, సింధీ భాషకు చెందిన వ్యాఖ్యాతను నియమించారు. వారికి శిక్షణానంతర ధ్రువపత్రాలను వెంకయ్యనాయుడు 2018 జులై 10న అందజేశారు.

views: 932

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams