Current Affairs Telugu Daily

6 విద్యాసంస్థలకు IOE హోదా 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 6 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(IOE)’ హోదా కల్పించింది.
  • ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది.
  • ప్రభుత్వరంగ సంస్థలు ఐఐటీ డిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, బిట్స్‌ పిలానీ, రియన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను కేంద్రం ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది.
  • IOE హోదా పొందిన ఈ 3 ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది.
  • ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది.
  • మాజీ ప్రధాన ఎన్నిక కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ తొలి దశలో 6 సంస్థలకు IOE ప్రకటించింది.
  • IOE హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 27 టాప్‌ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థలు ఉన్నాయి.
IOE-Institutions of Eminence

views: 995Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams