Current Affairs Telugu Daily

స్థానిక ప్రాంత ప్రణాళిక, పట్టణ ప్రణాళిక పథకంలో విశాఖ, వరంగల్‌ 
పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం అమృత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 25 నగరాల్లో స్థానిక ప్రాంత ప్రణాళిక, పట్టణ ప్రణాళిక పథకం (లోకల్‌ ఏరియా ప్లాన్‌, టౌన్‌ ప్లానింగ్‌ స్కీమ్‌)ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.
  • గ్రేటర్‌ విశాఖపట్నం, వరంగల్‌ నగరపాలక సంస్థలను జాబితాలో చేర్చింది. ఈ పథకం కింద నగరాలను బ్రౌన్‌ఫీల్డ్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించి మౌలికవసతుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తారు.
  • నగరాల్లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ మౌలిక వసతులపరంగా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే వాటిని బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించి స్థానిక ప్రాంత ప్రణాళిక అమలు చేస్తారు.
  • ఎలాంటి అభివృద్ధికీ నోచని శివారు ప్రాంతాలను గ్రీన్‌ఫీల్డ్‌గా భావించి పట్టణ ప్రణాళిక(టౌన్‌ప్లానింగ్‌) కింద అభివృద్ధి పరుస్తారు.
  • ఇందుకోసం కేంద్రం 100% సాయం చేస్తుంది. నగరాలకు అత్యవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యతాక్రమంలో ఈ పథకాల కింద చేపట్టవచ్చు.
  • 25 నగరాలకు కలిపి కేంద్రం రూ.50 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఒక్కో నగరానికి రూ.2 కోట్ల చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.
  • ప్రాథమిక ప్రతిపాదనలు పంపినప్పుడు 20%, ముసాయిదా ప్రణాళిక సమర్పించినప్పుడు 40%, తుది ప్రణాళిక సమర్పించినప్పుడు మిగిలిన మొత్తం అందిస్తారు.
  • ఈ పథకం కింద ఏడాదిలోపు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

views: 839

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams