Current Affairs Telugu Daily

అభివృద్ధి చెందిన దేశాల్లో పేద బాలలు 20 శాతం : యూనిసెఫ్‌
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాలలు పేదరికంలో మగ్గిపోతున్నారు. స్థానిక ప్రమాణాలను బట్టి చూస్తే 20% మంది పేదరికంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి బాలలనిధి (యూనిసెఫ్‌) గురువారం విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. అలాంటి దేశాల్లో దాదాపు 13% మంది చిన్నారులకు పౌష్టికాహారం అంద డం లేదంది. అంతర్జాతీయ సగటు కన్నా అగ్రరాజ్యం అమెరికాలో బాలల పేదరికం ఎక్కువగా ఉంది. అమెరికాతోపాటు బ్రిటన్‌లో వీరి సంఖ్య 20 శాతంగా ఉంది. అధికాదాయమున్న 41 దేశాల్లో విద్య, మానసిక ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, పర్యావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కౌమారదశ బాలల సంక్షేమంపై యూనిసెఫ్‌ ర్యాంకులు ఇచ్చింది. ఈ జాబితాలో జర్మనీ, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ లాంటి దేశాలు అగ్రభాగాన నిలిచాయి. రుమేనియా, బల్గేరియా, చిలీ చివరి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాది 37వ స్థానం. పేదరికం, ఆకలి, ఆరోగ్యం, విద్య, అసమానత విషయాల్లో అమెరికా వెనకబడి ఉంది.
15-19 ఏళ్ల యువత ఆత్మహత్యల్లో న్యూజిలాండ్‌ తొలిస్థానంలో ఉంది.

views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams