Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు బిర్యానీ 
ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల బిర్యానీ అనగానే హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటారు.
  • అదే స్థాయిలో బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని, ఈ బిర్యానీని విస్తృత వినియోగంలో తేవాలని నిర్ణయించారు. 
బొంగు బిర్యానీ తయారీ.. 
  • ముందుగా ఒక మూరెడు పొడవు గల వెదురుబొంగును తీసుకుంటారు. అందులో ఒకవైపు కనుపు ఉండేలా చూస్తారు.
  • రెండోవైపు నుంచి చికెన్‌ బిర్యానీ కోసం సిద్ధం చేసిన బియ్యం(చికెన్‌, మసాల వంటివన్నీ కలిపి) నింపుతారు.
  • తర్వాత రెండు గ్లాసుల మేర నీటిని పోస్తారు. ఆపై ఆకుతో బొంగుపై భాగాన్ని మూసేస్తారు. ఆ బొంగును తీసుకువెళ్లి కట్టె పొయ్యిపై పెడతారు.
  • వేడికి బొంగు బాగా కాలినపుడు ఆ బొంగులోని నీరు ఆ చికెన్‌ బిర్యానీలో కలుస్తుంది. అదే సమయంలో చికెన్‌ ఉడకడం వల్ల దాన్నుంచి నీరు వస్తుంది.
  • ఈ రెండు నీళ్లు కవడం వల్ల బిర్యానీకి అదనపు రుచినిస్తుంది. బొంగు బాగా కాలి బొగ్గురూపంలోకి వచ్చినపుడు బయటకు తీస్తారు. పై భాగంగా మూసిన ఆకును తీసేని లోపల తయారైన నూనెలేని చికెన్‌ బిర్యానీ వంచి వడ్డిస్తారు.
  • పార్సిల్‌ కావాలంటే అదే బొంగును పేపర్లో చుట్టి ఇస్తారు. 

views: 1090



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams