Current Affairs Telugu Daily

న్యుమోనియా టీకా కార్యక్రమం భేష్‌ : యూకే అధ్యయనం
ఊపిరితిత్తుల వాపు వ్యాధి (న్యుమోనియా) నుంచి చిన్నారుల్ని రక్షించడానికి వీలుగా భారత్‌ చేపట్టిన టీకాల కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇవ్వబోతోందని యూకేలోని స్ట్రాత్‌క్లైడ్‌ విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ’ అధ్యయనంలో వెల్లడయింది.
  • అయిదేళ్ల లోపు వయస్కులైన 35 వేలమంది మరణాలను నివారించడంలో ఇది దోహదపడుతుందని అంచనా వేసింది. భారత్‌లో 2010లో న్యుమోనియా కారణంగా 1,05,000 మంది పిల్లలు (5 సం॥ లోపు వారు) మృతి చెందారు.
  • దీంతో ఈ వ్యాధి నిరోధక టీకాను సార్వత్రిక కార్యక్రమం కింద చేర్చినా, దీనికయ్యే వ్యయం మాత్రం ఎక్కువే. పైపెచ్చు- తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో ఇది ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది.
  • 2021 వరకు టీకాల కార్యక్రమానికి బయటి నుంచి ఆర్థిక సాయం అందనున్నా, ఆ తర్వాత మాత్రం భారత ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించాలి.
  • 35 వేల మంది పిల్లల మరణాలను అరికట్టే కార్యక్రమంపై 24 కోట్ల డాలర్లు (రూ.1600 కోట్లు) ఖర్చవుతాయని, ఆయా కుటుంబాలకు ఏటా చికిత్స ఖర్చు రూపంలో 4.87 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని అధ్యయనం తెలిపింది.
  • ఈ అధ్యయనానికి బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్థ నిధుల్ని సమకూర్చింది.

views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams