Current Affairs Telugu Daily

ఆదిత్య పలివాల్‌కు గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌ 
బెంగళూరులోని ఐఐటీబీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదువుతున్న ఆదిత్య పలివాల్‌(22) అనే విద్యార్థికి గూగుల్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.
  • ఏడాదికి రూ.1.2 కోట్ల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్లు  లేఖను పంపింది.
  • ముంబయికి చెందిన ఆదిత్య బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తూనే గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కంప్యూటర్‌ భాష కోడింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
  • వివిధ దేశాలకు చెందిన 6 వేల మంది పరీక్ష రాయగా, 50 మంది చివరి అంకానికి చేరుకున్నారు. వారికి కృత్రిమ మేధస్సు, సాంకేతికత పరిశోధన అంశాలపై మరోమారు పరీక్ష నిర్వహించగా ఆదిత్య మొదటి స్థానంలో నిలిచారు. 

views: 1277

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams