Current Affairs Telugu Daily

TSRTCకి 3 పురస్కారాలు
అశోక్‌ లేలాండ్‌, అభిబస్‌ సంస్థలు ఏటా అందించే ఇండియా బస్‌ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)కు 3 పురస్కారాలు దక్కాయి.
  • ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకుగాను 2018 సంవత్సరానికి నాయకత్వ పురస్కారం, బయో డీజిల్‌, సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగిస్తూ వాయుకాలుష్యాన్ని నివారిస్తున్నందుకు ప్రథమ పురస్కారం, సుశిక్షితులైన డ్రైవర్లను తీర్చిదిద్దుతున్నందుకు టాప్‌ బస్‌డ్రైవర్‌ విభాగంలో ద్వితీయ పురస్కారం లభించాయి.
  • మలేసియాలోని కౌలాలంపూర్‌లో 4వ ఇండియా బస్‌ అవార్డును మలేసియా పర్యాటకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ దాతుక్‌సేరి మీర్జామహ్మద్‌ తాయిబా, డైరెక్టర్‌ మనోహర పెరియస్వామి 2018 జులై 7న ప్రదానం చేశారు. 
TSRTC-Telangana State Road Transport Corporation

views: 1186

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams