Current Affairs Telugu Daily

ఇజ్రాయెల్‌ రచయితకు ‘బుకర్‌’ అంతర్జాతీయ పురస్కారం
ప్రఖ్యాత మ్యాన్‌ బుకర్‌ అంతర్జాతీయ పురస్కారాన్ని ఈసారి ఇజ్రాయెల్‌ రచయిత డేవిడ్‌ గ్రాస్‌మన్‌ దక్కించుకున్నారు. ‘ఏ హార్స్‌ వాక్స్‌ ఇన్‌ టు బార్‌’ అనే నవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. హిబ్రూలో రాసిన ఈ పుస్తకాన్ని జెస్సికా కోహెన్‌ ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఏటా ఆంగ్లంలోకి అనువాదమైన ఉత్తమ కాల్పనిక రచనకు అంతర్జాతీయ బుకర్‌ పురస్కారాన్ని అందిస్తారు. విజేతకు దాదాపు రూ.41 లక్షల నగదు బహుమతిని కూడా ఇస్తారు. గ్రాస్‌మన్‌, జెస్సికా ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. ఉత్తమ ఆంగ్ల కాల్పనిక పుస్తకానికి బుకర్‌ పురస్కారం ఇస్తున్నట్లుగానే.. అంతర్జాతీయ రచయితలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక పురస్కారాన్ని ఇవ్వడాన్ని మ్యాన్‌ గ్రూప్‌ 2005లో ప్రారంభించింది.
 మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరం ఉత్తమ కాల్పనిక  నవలకి లభించె సాహిత్య బహుమతి.

views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams