Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ 2018 జులై 7న ప్రమాణం చేశారు.
  •  రాజ్‌భవన్‌లో గవర్నర్‌  నరసింహన్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. 
  • జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2004 అక్టోబర్‌ 14న ప్రమాణం చేశారు. అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా సేవలందించారు. 
  • 2017 ఫిబ్రవరిలో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
ఛత్తీస్‌గఢ్‌ సీజేగా పనిచేస్తూ  ఉమ్మడి హైకోర్టుకు సీజేగా బదిలీ అయ్యారు

views: 1080Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams