Current Affairs Telugu Daily

NHRC  లోగో విజేత బన్సిలాల్‌ కెట్కి 
జాతీయ మానవ హక్కు కమిషన్‌(NHRC ) లోగో విజేతలను 2018 జులై 6న ప్రకటించారు.
  • NHRC  రజతోత్సవం సందర్భంగా MyGov పోర్టల్‌ ద్వారా లోగో, ట్యాగ్‌లైన్‌ రూపకల్పనకు ఆహ్వానం పలికింది.
  • దేశవ్యాప్తంగా 893 మంది లోగో డిజైన్లు పంపగా, 4237 మంది స్లోగన్‌/ట్యాగ్‌లైన్లు పంపారు.
  • మహారాష్ట్రకు చెందిన బన్సిలాల్‌ కెట్కి రూపొందించిన లోగోను విజేతగా ప్రకటించింది.
  • ధ్రువపత్రం, రూ.50వేల నగదు బహుమతి బన్సిలాల్‌కు అందజేయనున్నారు. స్లోగన్‌/ట్యాగ్‌లైన్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన తబ్రేజ్‌ ఖురేషి పంపిన ‘ఆవాజ్‌ ఆప్కే అధికార్‌ కీ’ ట్యాగ్‌లైన్‌,  ‘దేశ్‌మే వికాస్‌ కి ఆయేగే బాహర్‌, జబ్‌ హోగా సురక్షిత్‌ మానవ్‌ అధికార్‌’ స్లోగన్‌ తొలి స్థానంలో నిలిచింది.
  • కేరళకు చెందిన రజత్‌ సెబాస్టియన్‌ 2వ  స్థానంలో, పంజాబ్‌కు చెందిన రంజన గోయెల్‌ 3వ స్థానంలో నిలిచారు.
NHRC ఛైర్మన్‌ - హెచ్‌.ఎల్‌.దత్తు
NHRC ఏర్పాటు - 1993 అక్టోబర్‌ 12
NHRC ప్రధాన కార్యాలయం-న్యూడిల్లీ
NHRC-National Human Rights Commission of India

views: 1330

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams