Current Affairs Telugu Daily

రైళ్లలో ఇక డిజీ లాకర్‌ పత్రాలకూ గుర్తింపు
రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తింపు కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ డిజీ లాకర్‌లో ఉంచిన ఆధార్‌, చోదక అనుమతి (డ్రైవింగ్‌ లైసెన్స్‌) సాఫ్ట్‌ కాపీలను చూపిస్తే సరిపోతుందని రైల్వేశాఖ ప్రకటించింది.
  • ఎవరైనా ఆధార్‌, పాన్‌ తదితర గుర్తింపు కార్డు, ఇతర ధ్రువపత్రాల ప్రతులను ఇంటర్నెట్‌లో భద్రపరచుకోవడానికి వీలుగా మోడి ప్రభుత్వం డిజీ లాకర్‌ సౌకర్యాన్ని కల్పించింది.
  • అందులో ఉంచిన గుర్తింపు పత్రాలను ప్రయాణికులు చూపిస్తే వాటిని అనుమతించాంటూ రైల్వేశాఖ అన్ని జోనళ్ల ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది.
  • డిజీ లాకర్‌లో లాగిన్‌ అయి ‘ఇస్యూడ్‌  డాక్యుమెంట్స్‌’ అనే విభాగం నుంచి గుర్తింపు పత్రాలను చూపిస్తే సరిపోతుందని వెల్లడించింది.

views: 893

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams