Current Affairs Telugu Daily

కర్ణాటకలో రైతులకు రుణ మాఫీ 
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 2018 జులై 5న విధానసభలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రైతులు జాతీయ, సహకార బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాల్ని రూ.2 లక్షల వరకూ మాఫీ చేశారు.
  • అన్నదాతల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మాఫీ మొత్తం రూ.34 వేల కోట్ల సమీకరణ చర్యల్లో భాగంగా పెట్రోలు, డీజిల్‌, విద్యుత్తు, మద్యంపై పన్నులు, సుంకాల్ని అధికం చేసింది.
  • రుణమాఫీకి కావాల్సిన నిధుల సమీకరణకు పెట్రోలు, డీజిల్‌పై ప్రస్తుతం విధిస్తున్న అమ్మకం పన్ను వరుసగా 30, 19 శాతాలు. దాన్ని 32, 21 శాతాకు పెంచారు. 
  • భారత్‌ తయారీ విదేశీ మద్యం 18 స్లాబులలోని సుంకాల్ని 4 శాతంపెంచారు.
  • మోటారు వాహనాల పన్నును ప్రతి చదరపు మీటరుకు 50 శాతం పెంచారు.
  • విద్యుత్తు వినియోగ పన్నును 6 నుంచి 9 శాతానికి, సొంతంగా ఉత్పత్తి చేసి వినియోగించుకునే విద్యుత్తు యూనిట్‌కు పన్నును పది పైస నుంచి ఇరవై పైసకు అధికం చేశారు.
  • మొత్తం బడ్జెట్‌ పరిమాణం రూ.2,18,488 కోట్లు. అందులో లోటు రూ.579 కోట్లుగా తేల్చారు.
  • ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తిగా శూన్య పెట్టుబడి సహజ సేద్యాన్ని ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు.
  • చైనా తయారీ వస్తువు, విడిభాగా వెల్లువకు అడ్డుగోడ కట్టి, ఆ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. 

views: 889

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams