Current Affairs Telugu Daily

వదంతుల వ్యాప్తిని అరికట్టే పరిష్కారానికి వాట్సాప్‌ రూ.34లక్షల బహుమతి
తమ వేదికపై వదంతులు, అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టే పరిష్కారాలతో ముందుకువచ్చే పరిశోధకులకు రూ.34లక్షల దాకా నగదు ప్రోత్సహాకాలు ఇస్తామని వాట్సాప్‌ ప్రకటించింది.
  • రహస్య నిక్షిప్త (ఎన్‌క్రిప్టెడ్‌) వ్యవస్థకు లోబడే సమస్యాత్మక సందేశాల సరళిని గుర్తించే విధానాలపై పరిశోధనలు సాగించేవారి కోసం తాము అన్వేషిస్తున్నట్లు తెలిపింది.
  • భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేసియా, మెక్సికో వంటి దేశాల్లో సాగించే పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.
  • వాట్సాప్‌ వేదికగా వ్యాపిస్తున్న వదంతుల కారణంగా అపోహు పెంచుకుని జనాలు అమాయకులపై దాడులకు పాల్పడుతున్న ఘటను ఇటీవల ఎక్కువైన  నేపథ్యంలో వాట్సాప్‌పై విమర్శలు వచ్చాయి.
  • అసత్య వార్త వ్యాప్తిని అరికట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం కూడా వాట్సాప్‌ను హెచ్చరించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వాట్సాప్‌ ప్రకటించింది.

views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams