Current Affairs Telugu Daily

మాజీ సీజే జస్టిస్‌ భగవతి కన్నుమూత
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌.భగవతి(96) గురువారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు.
 న్యాయవ్యవస్థలో మైలురాయిగా చెప్పుకొనే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ఆయన ప్రారంభించారు.
ఇతని పుర్తి పేరు-జస్టిస్‌ ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్‌ భగవతి
1978లో మేనకా గాంధీ పాస్‌పోర్టు అప్పగింత అంశానికి సంబంధించిన కేసులో వెలువరించిన తీర్పు ఆయన ప్రధాన తీర్పుల్లో ఒకటి. ‘జీవించే హక్కు’ అనే భావన విస్తృతార్థాన్ని ఈ తీర్పులో విశదీకరించారు. వ్యక్తి కదలికలను నియంత్రించజాలమని పేర్కొన్నారు. పాస్‌పోర్టు కలిగి ఉండేందుకు వ్యక్తికి హక్కు ఉందని స్పష్టంచేశారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మినర్వా మిల్స్‌ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంలో 42వ రాజ్యాంగ సవరణను సమర్థించిన ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్‌ భగవతి. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు దీనిని కొట్టివేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భాష్యంపై కోర్టు ఈ కేసులో స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు రాజ్యాంగం పరిమిత అధికారాన్నే ఇచ్చిందని తెలిపింది. ఈ పరిమిత అధికారంతో పార్లమెంటు తనకు తాను అపరిమిత అధికారాన్ని సంక్రమింపజేసుకోలేదని తేల్చిచెప్పింది. జస్టిస్‌ భగవతి 1973 జులైలో సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 17వ ప్రధాన న్యాయమూర్తిగా 1985 జులై నుంచి 1986 డిసెంబరు వరకు సేవలందించారు. 

views: 968

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams