Current Affairs Telugu Daily

షాట్‌ పుటర్‌ ఇందర్‌జీత్‌సింగ్‌పై 4 సం॥ల నిషేధం
భారత అగ్రశ్రేణి షాట్‌ పుటర్‌ ఇందర్‌జీత్‌సింగ్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) క్రమశిక్షణ కమిటీ నాలుగేళ్ల నిషేధం విధించింది.
  • ఇందర్‌జీత్‌సింగ్‌ రియో ఒలింపిక్స్‌కు ముందు డోప్‌ టెస్టులో విఫలమయ్యాడు.
  • దీనిపై విచారణ జరిపిన జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణ కమిటీ ఇందర్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
  • రియో ఒలింపిక్స్‌కు అందరికంటే ముందు అర్హత సాధించిన అథ్లెట్లలో ఇందర్‌జీత్‌ ఒకడు. ఒలింపిక్స్‌ ముంగిట నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో అతను యాండ్రోస్టెరోన్‌, ఎటియోకొనలోన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది.
  • 2016 జూన్‌ 26న అతడిపై ప్రాథమికంగా సస్పెన్షన్‌ వేటు పడింది. ఇందర్‌జీత్‌ కేసును విచారించిన త్రిసభ్య కమిటీ అతను డోపింగ్‌ నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా నిర్ధరించింది.
  • ప్రాథమిక సస్పెన్షన్‌ పడ్డ తేదీ నుంచే నాలుగేళ్ల నిషేధం అమలవుతుందని కమిటీ ప్రకటించింది. అంటే ఇందర్‌జీత్‌ ఇంకో రెండేళ్ల పాటు నిషేధంలో ఉంటాడు. 
NADA-National Anti-Doping Agency

views: 1080

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams